![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -353 లో....స్వప్న ఒక యాడ్ లో చేసే ఛాన్స్ వచ్చిందని రెడీ అయి వెళ్తుంటే.. నువు సపోర్ట్ గా మాట్లాడు ఎందుకంటే అందరు తనపై కోప్పడాలని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. రాహుల్ వెళ్లి నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావంటూ స్వప్నతో అనగానే.. అలాంటి నిర్ణయం మీరు ఎందుకు తీసుకోవడం లేదని స్వప్న అంటుంది. నేను సంపాదిస్తుంటే కూర్చొని తిందామని అనుకుంటున్నావా అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని స్వప్న అంటుంది.
ఆ తర్వాత స్వప్న కిందకి వస్తుంటే ఆ డ్రెస్ చూసి అందరు షాక్ అవుతారు. నాకు ఒక బికినీ కంపెనీ వారు యాడ్ కోసం అగ్రిమెంట్ కి కాల్ చేశారని స్వప్న చెప్తుంది. అది చూసి నువ్వు వెళ్ళడానికి వీలు లేదని రుద్రాణి అంటుంది. అప్పుడే సీతారామయ్య వచ్చి దీనికి పరిష్కారం నేను వెతికానంటూ ఒక షాపింగ్ మాల్ పై వచ్చే రెంట్లు మొత్తం స్వప్నకి వచ్చేలా చేస్తాడు. దీని రెంట్ లక్షల్లో వస్తుంది. దీనిపై వచ్చే సంపాదన మాత్రమే మీకు.. దీన్ని అమ్మే హక్కు ఎవరికి లేదని సీతారామయ్య చెప్తాడు. దాంతో స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక అనామిక, ధాన్యలక్ష్మి తప్ప అందరు మంచి నిర్ణయం తీసుకున్నారని అంటారు. ఇంటి వారసులు కానీ వారికి అలా ఎలా ఇస్తారని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఈ ఇంటి ఆడపడుచు రుద్రాణి కోడలని ఇందిరాదేవి అనగానే.. ఏమైనా మీ సొంత కూతురా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇప్పుడు నీ బుద్ది బయటపడిందని రుద్రాణి అంటుంది. మా అత్తయ్య అన్న దాంట్లో తప్పు ఏముందని అనామిక కూడ అంటుంది. ఇక అపర్ణ, సుభాష్, ప్రకాష్ లు ఇంటి పెద్ద నిర్ణయాన్ని మీరు ఇద్దరు వ్యతిరేకిస్తున్నారా అంటూ వాళ్లపై కోప్పడతారు. నువ్వేం అనట్లేదు కాబట్టి నీ భార్య అలా మాట్లాడుతుంది.. లోపలికి తీసుకొని వెళ్ళు అని ప్రకాష్ కి సుభాష్ చెప్పగానే.. ధాన్యలక్ష్మిని ప్రకాష్ లాక్కొని వెళ్తాడు. అనామికని కూడా కళ్యాణ్ లోపలికి వెళ్ళమంటాడు. ఆ తర్వాత సీతారామయ్యకి స్వప్న థాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత అనామికకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి కళ్యాణ్ ని ప్రేమతో మార్చాలని చెప్తుంది.
మరొకవైపు కావ్య వాళ్ళ బావ లేడు కదా.. ఇక కావ్య నేను చెప్పినట్టు వింటుందని రాజ్ అనుకుంటాడు. కావ్య కాఫీతో పాటు ప్రోటీన్ పౌడర్ తీసుకొని వస్తే ఈ పౌడర్ ఎందుకని రాజ్ అడుగుతాడు. మా బావ వచ్చాడు బయట ఉన్నాడని చెప్పగానే.. రాజ్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఇందిరాదేవి, భాస్కర్, కావ్య లు బయట మాట్లాడుకుంటుంటే అప్పుడే రాజ్ దూరంగా ఉండి చూస్తాడు. ఇప్పటికైనా వెళ్లి నీ మనసులో కావ్యపై ప్రేమని చెప్పమని తన మనసాక్షి రాజ్ కి చెప్తుంది. తరువాయి భాగంలో రాజ్ రివర్స్ గా కావ్య, భాస్కర్ లని బయటకు వెళ్లి ఎంజాయ్ చేసి రండి అని చెప్తాడు. దాంతో కావ్య, భాస్కర్ లు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |